మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక ఈచిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం.
డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈచిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.
