దిల్ రాజుకు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా ?

Published on Jan 3, 2019 11:01 am IST

వరుస విజయాలతో టాలీవుడ్ లో నంబర్ వన్ ప్రొడ్యూసర్ గా కొనసాగారు దిల్ రాజు. అయితే ఇటీవల ఆయన బ్యానర్ నుండి వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం,లవర్’చిత్రాలు నిరాశపరిచడంతో కొంచెం వెనుకబడ్డారు ఈ స్టార్ ప్రొడ్యూసర్. అయితే మళ్లీ ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని ఈ సారి అనిల్ రావిపూడి ని నమ్ముకున్నాడు.ఇంతకుముందు అనిల్ ‘సుప్రీమ్ , రాజా ది గ్రేట్’ సినిమాల్తో దిల్ రాజుకు రెండు విజయాలను అందించాడు.ఇక ఇప్పుడు తాజాగా అనిల్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ఎఫ్ 2 జనవరి 12న విడుదలకానుంది.

ఇక సంక్రాంతి సీజన్ దిల్ రాజుకు బాగా కలిసొచ్చింది ఆయన నిర్మించిన గత చిత్రాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , ఎవడు , శతమానం భవతి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యాయి.మరి ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2 కూడా ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేసి దిల్ రాజుకు మంచి విజయాన్ని అందిస్తుందో చూడాలి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More