ప్రత్యేక ఇంటర్వ్యూ : నా దర్శకత్వంలో మరో హీరో నటిస్తాడు – అల్లరి నరేష్

ప్రత్యేక ఇంటర్వ్యూ : నా దర్శకత్వంలో మరో హీరో నటిస్తాడు – అల్లరి నరేష్

Published on Dec 29, 2012 12:16 AM IST

Allari-Naresh-shooting-at-G
ప్రస్తుతం పరిశ్రమలో మినిమం గ్యారంటీ హీరో అని చెప్పుకోవాలంటే అల్లరి నరేష్ అని చెప్పుకోవచ్చు. కామెడి కింగ్ గా పేరు తెచ్చుకున్న ఈ నటుడు అన్ని వర్గాల ప్రేక్షకులనుండి మెప్పు పొందాడు ఈరోజు ఈ నటుడు మా కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు “యాక్షన్ 3D” సెట్లో ఆయనతో మేము జరిపిన సంభాషణ మీకోసం

ప్ర) మొదటి సారిగా సోషియో ఫాంటసీ చిత్రం చేశారు. ఎలా అనిపిస్తుంది?
జ) (నవ్వుతూ) ఈ చిత్రాన్ని ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉంది. “సుడిగాడు” చిత్రం తరువాత అంచనాలు భారీగానే ఉంటాయి అంతటి అంచనాలను “యముడికి మొగుడు” అందుకోడం నిజంగా సంతోషకరమయిన విషయం. సోషియో ఫాంటసీ చిత్రంలో నటించడం నిజంగా విభిన్నమయిన అనుభూతి.

ప్ర) గ్రాఫిక్స్ కోసం ఉపయోగించే గ్రీన్ మ్యాట్ మీద చిత్రీకరణ మీకు కష్టమనిపించిందా?
జ) కష్టం అనిపించలేదు కాని చాలా ఓపిక కావాలి. ప్రతి షాట్ అయ్యాక అలానే ఉండిపోవాలి అలా ఉంటేనే కొన్ని సాంకేతిక అంశాలను సరిగ్గా తీసుకోగలరు. షాట్ కరెక్ట్ గా రావడానికి మనకి చాలా ఊహాశక్తి ఉండాలి. దర్శకత్వం మీద మక్కువ ఉండటంతో చాలా ఆసక్తికరంగా అనిపింది. ఈ చిత్రంలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది.

ప్ర) దర్శకత్వం వైపు రానున్నారు అయితే ?
జ) అవును. నిజానికి దగ్గరగా ఉండే ప్రేమకథలు అంటే నాకు చాలా ఇష్టం, కామెడీ చిత్రాలలో నటిస్తున్నాను కాని కామెడీ చిత్రాలను రచించలేను. ఒకేసారి రెండు పడవల్లో ప్రయాణించాలనుకోవట్లేద. ప్రస్తుతం నటనకే ప్రాధాన్యం ఇస్తున్నా. 5-6 ఏళ్ళ తరువాత దర్శకత్వం వైపు వస్తాను.

ప్ర) మీ చిత్రంలో మీరు హీరోగా నటిస్తారా?
జ) లేదు. నేను దర్శకత్వం వహించే చిత్రంలో మరొక హీరో నటిస్తారు.

ప్ర) యమధర్మ రాజ మీద చాల చిత్రాలు వచ్చాయి కదా, మీకు “యముడుకి మొగుడు” చిత్రం ఎంపిక చేసుకోవాలని ఎందుకు అనిపించింది?
జ) యముడి కూతురితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మాములుగా అన్ని చిత్రాలలో హీరో చచ్చిపోయి యమలోకానికి వెళ్తాడు అక్కడ కామెడి పండుతుంది ఇందులో అందుకు విభిన్నం. అందుకే ఈ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నాను. యముడికి నరుడికి నడుమ విభిన్నమయిన హాస్యాన్ని ఇందులో చూడవచ్చు.

ప్ర) రమ్య కృష్ణ తో పని చెయ్యడం ఎలా అనిపించింది?
జ) ఇది మూడవ చిత్రం ఆమెతో నటించడం ఇంకా కూడా ఆమెకు చాల మంది అభిమానులు ఉన్నారు ధియేటర్ లో “అత్తో అత్తమ్మ కూతురో” సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే తెలిసిపోతుంది.

ప్ర) యమధర్మ రాజు అంటే వాయిస్ బలంగా ఉండాలి సాయాజీ షిండే ని ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది?

జ) నా చిత్రాలు అన్ని కామెడీ కేంద్ర బిందువుగా వస్తుంటాయి. స్టేజ్ మీద సాయాజీ షిండే కి యముడి పాత్రలు వేసిన అనుభవం ఉంది. అయన డిక్షన్ మరియు హావభావాలతో కామెడీ పండించగలం అనిపించింది. దానికి అతనే సరిపోతాడు అనిపించి ఈ పాత్రకు తీసుకోవడం జరిగింది.

ప్ర) “అత్తో అత్తమ్మ కూతురో” పాట చిరంజీవి గారి భారీ హిట్, ఈ పాట రీమిక్స్ చెయ్యాలనుకున్నప్పుడు మీకు పోల్చి చూస్తారని భయం అనిపించలేదా ?
జ) చాలా భయం వేసింది కాని ఈ చిత్రంలో ఆ సన్నివేశానికి ఆ పాట సరిగ్గా సరిపోతుంది నిజానికి ఇది కోటి గారి ఆలోచన దర్శకుడు సత్తిబాబు ఈ సన్నివేశాన్ని చెప్పగానే కోటి గారు ఈ పాట రీమిక్స్ చేద్దాం అన్నారు.

ప్ర) గ్రాఫిక్స్ ఉన్న సోషియో ఫాంటసీ చేసిన వెంటనే 3D చిత్రం చేస్తున్నారు ఆ అనుభవం ఇక్కడ సహాయ పడుతుందా?
జ) కొంతవరకు అవుననే చెప్పాలి. 3D చిత్రం చేసేప్పుడు కూడా చాలా ఓపిక కావాలి. ఉదాహరణకు ఒక బాటిల్ ని కెమెరా వైపు తన్నాలి, 3D ఎఫెక్ట్ కోసం సరిగ్గా ముందుగా నిర్ణయించబడిన ప్రదేశంలోనే తన్నాలి. రెండు కెమెరాలు మనల్ని ఫోకస్ చేస్తూ ఉంటాయి చాలా సాంకేతిక అంశాలను త్రుప్తి పరచాలి. అప్పుడే చిత్రం సరిగ్గా వస్తుంది.

ప్ర) యాక్షన్ 3D చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది?
జ) ఈ చిత్రం వేసవి కాలంలో విడుదల కానుంది. మొదటి 3D కామెడీ చిత్రం కావడంతో అందులోనూ భారీ సాంకేతిక అంశాల నడుమనిర్మిస్తుండడం ఈ చిత్రం మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాము దర్శకుడు అనిల్ సుంకర చాలా ఓపికగా పని చేస్తున్నారు.

ప్ర) ఖాళి సమయాలలో ఏం చేస్తుంటారు?
జ) సినిమాలు చూస్తుంటాను ఖాళి దొరికినప్పుడల్లా ఏదో ఒక చిత్రం చూడటం అలవాటు. నేను విమర్శకుడిని అయితే బాగుణ్ణు మొదటిరోజే సినిమాలు చూడగలను (నవ్వుతూ). క్రికెట్ చూడటం మరియు అప్పుడప్పుడు ఆడటం అలవాటు.

ప్ర) మీ డైరిలో చాలా చిత్రాలు ఉన్నట్టు ఉన్నాయి?
జ) అవును. వేసవికి నేను రెండు చిత్రాలతో రానున్నాను “యాక్షన్ 3D ” మరియు “కెవ్వు కేక” ఇది కాకుండా సత్తిబాబు, శ్రీనివాస్ రెడ్డి మరికొందరితో చిత్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ఉన్నాయి అవి త్వరలో ప్రకటిస్తాను.

దీంతో ఆయనతో మా సంభాషణ పూర్తయ్యింది అయన “యాక్షన్ 3D” చిత్రీకరణలో పాల్గొనడానికి వెళ్ళిపోయారు ఈ చిత్రీకరణ మణికొండ వద్ద గంధర్వ మహల్ సెట్ లో జరుగుతుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు