‘గ్యాంగ్ లీడర్’ ఓవర్సీస్ లో వర్కౌట్ అవుతుందా ?

Published on Apr 29, 2019 10:18 am IST


‘గ్యాంగ్ లీడర్’ అంటేనే మాస్ కి సింబాలిజమ్. ఇప్పుడు ఇదే టైటిల్ తో నేచురల్ స్టార్ నాని హీరోగా – స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల వరకూ ఈ టైటిల్ బాగానే ఉంటుంది గాని, ఓవర్సీస్ లో ఈ టైటిల్ వర్కౌట్ అవుతుందా ? సినిమా టైటిల్ ను బట్టే.. ఆ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తి పెంచుకుంటున్న ఈ రోజుల్లో ఎప్పుడో 80 – 90 నాటి కాలం టైటిల్ పెట్టడం ఒకవిధంగా రిస్కే. పైగా ఈ టైటిల్ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ తీవ్రగంగానే తమ అభ్యంతరం తెలిపారు.

దీనికి తోడు టైటిల్ విషయంలో నాని పై ట్రోల్ కూడా చేశారు మెగా ఫ్యాన్స్. అయినప్పటికీ ‘గ్యాంగ్ లీడర్’ టీమ్ మాత్రం తమ సినిమాకు అదే టైటిల్ అని తీర్మానం చేసేసింది. మరి సినిమాలో టైటిల్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటో గాని.. మొత్తానికి టైటిల్ అయితే ఓవర్సీస్ లో అంత త్వరగా రీచ్ అయ్యేలా కనిపించట్లేదు. గత సినిమాల అనుభవం రీత్యా ఓవర్సీస్ లో క్లాస్ అండ్ కామిక్ టైటిల్స్ కు ఉండే క్రేజ్.. మాస్ టైటిల్స్ అంత త్వరగా ఉండదు. మరి సినిమా రిజల్ట్ పై.. ఈ టైటిల్ ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో నాని సరసన చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :