సినిమా వసూళ్ళపై ఐ.పి.ఎల్ ప్రభావం?

సినిమా వసూళ్ళపై ఐ.పి.ఎల్ ప్రభావం?

Published on Apr 17, 2014 3:15 AM IST

ipl
ఈరోజు ప్రారంభమైన ఐ.పి.ఎల్ దాదాపు మరో రెండు నెలల వరకూ సినిమా నిర్మాతలకు, పంపిణీదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. గతకొన్ని సంవత్సరాలుగా ఈ పొట్టి క్రికెట్ తెలుగు సినిమాను బాగా ప్రభావితం చేసింది

దీని ప్రభావం ఏ మేరకు వుంటుంది అంటే ఈ లీగ్ వున్నంతకాలం చాలా పెద్ద బడ్జెట్ సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల పుణ్యమా అని ఈ ప్రభావం రెండింతలు పడనుంది. దాదాపు 18-35 వారు ఈ క్రికెట్ లీగ్ కు బానిసలు గా మారుతున్నారు గనుక సినిమాలు నష్టపోయే అవకాశం వుందని అంచనా

ఈసారి కూడా ఐ.పీ.ఎల్ మంచి హిట్ అయితే రేసు గుర్రం, లెజెండ్ వంటి సినిమాలకు ఎంతోకొంత నష్టం కలగనుంది

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు