ఎఎన్ఆర్ కి కమల్ హాసన్ తన గాత్రాన్ని అరువిచ్చేనా.?

ఎఎన్ఆర్ కి కమల్ హాసన్ తన గాత్రాన్ని అరువిచ్చేనా.?

Published on Jun 26, 2014 11:48 AM IST

kamala-hasan
అక్కినేని ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘మనం’. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. మే 23న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఇంకా స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ప్రస్తుతం నాగార్జున ఈ సినిమాని తమిళంలోకి అనువదించాలనుకుంటున్నారు.

అందులో భాగం ఎఎన్ఆర్ పాత్రకి కమల్ హాసన్ వాయిస్ చెబితే బాగుంటుందని బావించి కమల్ ని అప్రోచ్ అయ్యారని సమాచారం. కానీ ఈ విషయం పై ఈ చిత్ర టీం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సమంత, శ్రియ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా పూర్వ జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

తాజా వార్తలు