
టాలీవుడ్ కి దూరమైపోయిన మల్టీ స్టారర్ ట్రెండ్ ని మళ్ళీ పరిచయం చేస్తూ ‘గమ్యం’, ‘వేదం’ లాంటి సినిమాలతో ఆకట్టుకొని ఆ తర్వాత ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ అని అందరినీ మెప్పించిన దర్శకుడు క్రిష్. అక్షయ్ కుమార్ ‘గబ్బర్’ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఈ గబ్బర్ సినిమా మే 1న రిలీజ్ అయ్యి సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. శృతి హాసన్, కరీనా కపూర్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి సంజయ్ లీలా భన్సాలి నిర్మించాడు. మాకు అందిన తాజా సమాచారం ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో దాదాపు 50 కోట్ల షేర్ మార్క్ కి దగ్గరయ్యింది.
దీంతో ట్రేడ్ పండితులు అంతా మన తెలుగు డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరుతాడని కొందరు అంచనా వేస్తున్నారు. మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్క్ సాధిస్తే క్రిష్ కి బాలీవుడ్ లో మరికొన్ని ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 2015లో బాలీవుడ్లో విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా గబ్బర్ నిలిచింది. ఒక పవర్ఫుల్ సోషల్ మెసేజ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కమర్షియల్గానూ పర్ఫెక్ట్గా రూపొందడంతో మరో రెండు వారాలు ఈ సినిమాకు తిరుగుండదనేది ట్రేడ్ టాక్.