ఎన్టీఆర్, వైఎస్సార్ సినిమాల రేంజ్ లో కేసీఆర్ సినిమా నిలబడగలదా ?

Published on Jul 20, 2018 3:04 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. దర్శకులు, నిర్మాతలు ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్స్ రూపంలో తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా క్రిష్, బాలక్రిష్ణలు కలిసి ‘ఎన్టీఆర్’ పేరుతో, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత గాథను మహి వి రాఘవ్, మమ్ముట్టిలు ‘యాత్ర’ పేరుతో రూపొందిస్తుండగా తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ బయోపిక్ ను కూడా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టకముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడగా, యాత్ర టీజర్ రిలీజ్ తర్వాత వైఎస్సార్ బయోపిక్ మీద కూడా భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయినా ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ చిత్రం పై ఉన్న ఉత్సుకత, ఆసక్తి, వైఎస్సార్ చిత్రం మీద లేదనే ఒప్పుకొని తీరాలి. దీనికి ప్రధాన కారణం దర్శకులే కారణం. క్రిష్ ఇప్పటికే ప్రతిభావంతుడైన అతికొద్ది మంది దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. యాత్ర చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ గత చిత్రం బాగానే సక్సెస్ అయిన, క్రిష్ తో పోల్చుకుంటే ఆయనకున్న పేరు, మార్కెట్ తక్కువనే చెప్పాలి. ఇప్పుడు ఆ ప్రభావం చిత్రాల మీద కూడా పడుతుంది.

కాగా కేసీఆర్ బయోపిక్ దర్శకుడు అల్లూరి కృష్ణం రాజుకు అమతకుముందు అసలు ఒక్క హిట్ కూడా లేదు. పైగా ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ ప్రభావం కేసీఆర్ చిత్రం మీద ఖచ్చితంగా పడుతుంది. అదే ఏ స్టార్ డైరెక్టరో గనుక కేసీఆర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు అయితే, ఎన్టీఆర్, వైఎస్సార్ చిత్రాల లాగే కేసీఆర్ చిత్రం మీద కూడా మంచి బజ్ క్రియేట్ అయి ఉండేది.

సంబంధిత సమాచారం :

X
More