సమంత సెంచరీ ఆశలపై ‘లెనిన్’ నీళ్లు జల్లుతాడా..?

సమంత సెంచరీ ఆశలపై ‘లెనిన్’ నీళ్లు జల్లుతాడా..?

Published on Jul 9, 2026 8:59 PM IST

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన రీసెంట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ వీకెండ్ ముగిసే సమయానికి సినిమా ఈ ఘనత సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం థియేటర్ల వద్ద కలెక్షన్ల వేగం కాస్త తగ్గడం, అలాగే జూలై 10న అఖిల్ అక్కినేని చిత్రం ‘లెనిన్’ థియేటర్లలోకి వస్తుండటం ఈ రన్‌కు కాస్త బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. నిజానికి ‘మా ఇంటి బంగారం’ కనుక రూ. 100 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఈ ల్యాండ్‌మార్క్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సమంత ఒక భారీ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అయితే, ఇప్పుడు అంతా ‘లెనిన్’ సినిమాపైనే ఆధారపడి ఉంది. రేపు విడుదల కాబోతున్న ‘లెనిన్’ చిత్రానికి కనుక పాజిటివ్ టాక్ వస్తే.. అది ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్లపై ఖచ్చితంగా ప్రభావం చూపి, సమంత 100 కోట్ల ప్లాన్స్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. మరి అఖిల్ ‘లెనిన్’ బాక్సాఫీస్ రేసును తట్టుకుని సమంత తన డ్రీమ్ 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు