మహేష్ పాన్ ఇండియా ఎంట్రీకి సరైన మూవీ..!

Published on Aug 6, 2020 9:22 am IST

టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ ఇంకా పాన్ ఇండియా మూవీ చేయకపోవడం ఆశ్చర్యకర అంశం అనాలి. ఆయన తరువాత స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతుండగా, ఎన్టీఆర్, చరణ్ మరియు బన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఇక పవన్ సైతం డైరెక్టర్ క్రిష్ మూవీతో బాలీవుడ్ లో ఎంటర్ కానున్నాడని సమాచారం. మహేష్ మాత్రం ఈ విషయంలో ఇంకా స్టెప్ తీసుకోలేదు.

ఐతే రాజమౌళితో మహేష్ మూవీ కన్ఫర్మ్ అయిన తరుణంలో ఆ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషలలో విడుదల కావడం ఖాయం. ఐతే ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి మరో రెండేళ్లు సమయం పట్టేలా ఉంది. దీనితో మహేష్ సర్కారు వారి పాట మూవీని పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేసే అవకాశం కలదు. దర్శకుడు పరశురామ్ కూడా ఈ మూవీ కోసం బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, మోసాలు అనే యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. కాబట్టి అన్నీ విధాలుగా పాన్ ఇండియా మూవీగా విడుదల చేయడానికి సర్కారు వారి పాట చిత్రానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి మహేష్ ఈ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెడతాడు అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More