‘బిగ్ బాస్ 2’తో నాని మెప్పిస్తాడా ?
Published on May 21, 2018 8:19 pm IST

బిగ్ బాస్ మొదటి సీజన్ కి వాఖ్యాత గా చేసిన ఎన్టీఆర్ అంచనాలకి తగట్టుగానే ఈ రీయాల్టీ షో ని తన వాక్ చాతుర్యంతో సూపర్ హిట్ చేసాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ ప్రారంభంలో ప్రసారమైన ఎపిసోడ్స్ కి ప్రేక్షకుల నుండి అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు. కొన్ని ఎపిసోడ్స్ తరువాత అనుహ్యంగ పుంజుకొని మా టీవీకి మంచి రేటింగ్స్ ని సాధించి పెట్టాయి . ఇక వీక్ ఎండ్ లో ఎన్టీఆర్ ఈ షో లో కనిపించిన సమయంలో టీవీ రేటింగ్స్ లో మాటీవీ నెంబర్ 1 పోజిషన్ కి చేరింది. మొదటి సీజన్ హిట్ అయ్యాక రెండో సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ కానుందని ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. ఈ షో ని ఇంతలా ప్రేక్షకులకు చేరువ చేసాడు ఎన్టీఆర్.

ఇక సెకండ్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహారిస్తున్న నాని కూడా మంచి వాక్ చాతుర్యం కలవాడే. ఇంతకుముందు కొన్ని అవార్డ్స్ ఫంక్షన్స్ కి యాంకర్ గా చేసిన అనుభవం కూడా ఉంది . బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకి ఇంకాస్త దగ్గరయ్యే అవకాశం ఉంటుందనే ఈ షో ఒప్పుకున్నాడు నాని. ఇటీవల రిలీజ్ చేసిన బిగ్ బాస్ 2 ప్రోమో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంటుంది. ఈ ప్రోమో లో చెప్పినట్టు సెకండ్ సీజన్ లో ఇంకాస్త ఎక్కువ ఎంటర్టైన్మెంట్ దొరికేట్టుగా చేంజెస్ చేసారు. మరి నాని బిగ్ బాస్ సెకండ్ సీజన్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో తెలియాలంటే జూన్ 10 వరకు వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook