నాని ‘వి’ విడుదల అప్పుడేనా?

Published on Aug 7, 2020 5:29 pm IST

నాని హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వి మూవీ విడుదల సందిగ్ధం కొనసాగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్న ఈ చిత్రం థియేటర్స్ రీ ఓపెన్ కొరకు ఎదురుచూస్తుంది. ఎప్పుడో మార్చి 25న విడుదల కావల్సిన వి మూవీ ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఓ టి టి లో విడుదల చేసే ఆలోచన లేకపోవడంతో నిర్మాతలు థియేటర్స్ తెరుచుకోవాలని కోరుకుంటున్నారు. కాగా థియేటర్స్ ప్రారంభమైన నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారట.

ఇక వి మూవీలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగివుంటుందట. ఇక మరో హీరో సుధీర్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. వీరి మధ్య నడిచే వార్ మూవీలోని ఆసక్తి కర అంశం అని తెలుస్తుంది. నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కింది.

సంబంధిత సమాచారం :

More