టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించిన హీరో నవీన్ పొలిశెట్టి వరుసగా ఎంటర్‌టైనర్ చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే, ఆయన లాస్ట్ మూవీ ‘మిస్టర్ అండ్ మిస్ పొలిశెట్టి’ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఆ తర్వాత నవీన్ నుంచి ఒకట్రెండు అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి. కానీ, సినిమా మాత్రం రాలేదు.
అయితే, ఆయనకు ఓ యాక్సిడెంట్ అయ్యిందని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు ఆ మధ్య వీడియో రూపంలో తెలిపాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టులను వరుసగా తెరకెక్కించేందుకు నవీన్ రెడీ అవుతున్నాడు. అయితే, ఈ క్రమంలో ఓ సీనియర్ డైరెక్టర్‌తో నవీన్ సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తమిళ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ఓ చిన్న లవ్ స్టోరీ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.
సఖి, మౌనరాగం, ఓకే బంగారం తరహాలో ఈ మూవీ చిన్న బడ్జెట్‌తో రూపొందించాలని ఆయన భావిస్తున్నాడట. దీని కోసం ఆయన నవీన్ పొలిశెట్టికి ఓ లైన్ కూడా వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం మణిరత్నం ఫామ్‌లో లేడని.. దీంతో నవీన్ ఆయన సినిమాకు ఓకే చెబుతాడా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.