
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.. ఇటీవలే మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన ఎన్.టి.ఆర్ ఈ షూటింగ్ గ్యాప్ ని తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాకుండా తన తదుపరి సినిమాలకు సంబందించిన కథలను కూడా వినే ఆలోచనలో ఉన్నాడు. ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో ఉంటుందని అన్నారు కానీ కచ్చితమైన క్లారిటీ లేదు.
ఇదిలా ఉండగా బలుపు, పండగ చేస్కో సినిమాలతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఎన్.టి.ఆర్ కోసం ఓ కథని సిద్దం చేస్తున్నాడు. అది కూడా తమిళ టాప్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ తో కలిసి ఎన్.టి.ఆర్ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయేలా కథని సిద్దం చేస్తున్నాడు. అక్టోబర్ మొదటి వారంలో గోపీచంద్ మలినేని ఎన్.టి.ఆర్ ని కలిసి కథ చెప్పనున్నాడు. కథ బాగా నచ్చి ఎన్.టి.ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమాని సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తాడు. మరి గోపీచంద్ మలినేని చెప్పబోయే కథ ఎన్.టి.ఆర్ ని మెప్పిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

