పవన్ మళ్ళీ ఎక్కువ గ్యాప్ తీసుకోనున్నారా.?

Published on May 14, 2021 7:05 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”తో చాన్నాళ్ళకి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా లైన్ లో ఉండగానే పవన్ మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి అన్ని బాగుండి ఉంటే వకీల్ సాబ్ ఎప్పుడో విడుదల అయ్యిపోవాల్సి ఉంది. కానీ ఈ ఏడాదికి షిఫ్ట్ అయ్యింది.

మరి ఆ సినిమాకు మధ్యలో పవన్ ఎంత గ్యాప్ తీసుకున్నారో కూడా తెలిసిందే. అలా ఈసారి కూడా మళ్ళీ షూటింగ్స్ పవన్ ఎక్కువ విరామమే తీసుకోనున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితులు అసలే బాగాలేవు పైగా ఇటీవలే పవన్ కరోనా నుంచి కూడా కోలుకున్నారు. ఇవన్నీ చూస్తే అప్పుడు వకీల్ సాబ్ కి తీసుకున్నట్టుగానే ఈసారి కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోవడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :