స్పిరిట్ కోసం ప్రభాస్ ఆ నిర్ణయం తీసుకుంటాడా..?

స్పిరిట్ కోసం ప్రభాస్ ఆ నిర్ణయం తీసుకుంటాడా..?

Published on Jan 24, 2026 11:01 PM IST

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలను సెట్స్ మీద ఉంచడం వల్ల నిర్మాతలు బడ్జెట్ మరియు డేట్ల విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ‘రాజా సాబ్’ ప్రభావం నేరుగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’పై పడింది. షూటింగ్ షెడ్యూల్స్ క్లాష్ అవ్వడం వల్ల అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తికాక డేట్ల సమస్యలు తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం ‘ఫౌజీ’ సగం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, అందరి దృష్టి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ పైకి మళ్ళింది. ‘స్పిరిట్’ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేస్తామని ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ‘ఫౌజీ’ విడుదల తేదీపై మైత్రీ మూవీ మేకర్స్ నుండి ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఫ్యాన్స్‌లో గందరగోళం నెలకొంది.

ముఖ్యంగా ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ పూర్తిగా కొత్త లుక్‌లోకి మారాల్సి ఉండటం, సందీప్ రెడ్డి వంగా కండీషన్ల నేపథ్యంలో ‘ఫౌజీ’ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఫౌజీ’ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్‌కు క్లారిటీ ఎప్పుడు లభిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు