ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు పి. డైరెక్ట్ చేయగా పూర్తి ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
ఇక రామ్ ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఓ తమిళ డైరెక్టర్‌తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో లింగుసామి డైరెక్షన్‌లో ‘వారియర్’ చిత్రంలో రామ్ నటించాడు. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు మరోసారి తమిళ దర్శకుడితో రామ్ ఎందుకు రిస్క్ చేస్తున్నాడా అని అందరూ అనుకుంటున్నారు.
అయితే, తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని తనదైన కథా నెరేషన్‌లతో బాక్సాఫీస్ దగ్గర విజయాలు అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో ‘బ్రో’ సినిమా చేసిన ఆయన ఇప్పుడు రామ్‌కు ఓ కథను నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.


