రష్మిక హ్యాట్రిక్ కొడుతుందా ?

Published on Sep 26, 2018 7:57 pm IST

‘ఛలో’ చిత్రం తో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. ఈచిత్రం సూపర్ హిట్ సాధిచడంతో తెలుగులో ఆమె కు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఈ చిత్రం తరువాత విజయ్ దేవరకొండతో కలిసి ‘గీత గోవిందం’ సినిమాలో నటించింది. ఇటీవల విడుదలైన ఈచిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరి డబుల్ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఆమె నటించిన రెండు చిత్రాలు ఒకదానికి మించి ఒకటి విజయం సాధించడంతో ఇండస్ట్రీ లో గోల్డెన్ లెగ్ గా మారింది. ఇక తాజాగా ఆమె నటించిన మూడవ చిత్రం ‘దేవదాస్’. నాగార్జున ,నాని కలిసి నటించిన ఈచిత్రంలో రష్మిక, నాని కి జోడిగా నటించింది.

ఈ సినిమా రేపు ప్రేక్షకులముందుకు రానుంది. మరి ఈ సినిమా విజయం సాధిస్తే రష్మిక హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకొని కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమా ఫలితం తెలియాలంటే మరి కొన్ని వేచి చూడక తప్పదు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం దాంతో పాటు మొదటి సారి నాగ్, నాని కలిసి నటిస్తున్న చిత్రం అవ్వడంతో చిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి.

సంబంధిత సమాచారం :