ఎన్టీఆర్, చరణ్ కూడా అలా అంటే…ఆర్ ఆర్ ఆర్ పరిస్థితి ఏమిటీ?

Published on Jul 1, 2020 9:22 am IST

కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వైరస్ బారిన పడిన దేశాల జాబితాలో ఇండియా మూడో స్థానానికి చేరుకొని కలవరపెడుతుంది. రోజుకు వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షూటింగ్స్ కి వెళ్ళడానికి హీరోలు ససేమిరా అంటున్నారు. కొద్దిరోజుల క్రితం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయండం జరిగింది. అడపాదడపా షూటింగ్స్ మొదలుకాగా…దానివలన కరోనా కేసులు నమోదయ్యాయి.

దీనితో ఇప్పటికే సీనియర్ హీరోలు షూటింగ్స్ కి ససేమిరా అంటున్నారు. వయసు రీత్యా వారికి కరోనా సోకితే తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీనితో 2020 ముగిసే వరకు షూటింగ్ కి వెళ్లకపోవడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ నిర్ణయం తీసుకుంటే ఆర్ ఆర్ ఆర్ పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు. కొంచెం లేటైనా ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుపెడితేనే అది 2021 లో విడుదల అవుతుంది. అలా కానీ పక్షంలో 2022కి ఆర్ ఆర్ ఆర్ షిఫ్ట్ అవ్వాల్సిందే.

సంబంధిత సమాచారం :

More