ఇక సమంత ఆ పాత్రలోనే కనిపిస్తుందా..?

ఇక సమంత ఆ పాత్రలోనే కనిపిస్తుందా..?

Published on Jun 29, 2026 10:07 PM IST

‘మా ఇంటి బంగారం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ రీఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత, ఇప్పుడు నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. తన భర్త రాజ్‌తో కలిసి యువ నటీనటులు, సరికొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ టాలీవుడ్‌లో వరుస కంటెంట్-ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించేందుకు ఆమె రెడీ అవుతోంది.

గతంలో తాను నిర్మించిన ‘శుభం’ సినిమా తరహాలో కాకుండా, ఈ కొత్త ప్రాజెక్ట్‌లలో ఆమె నటించకుండా కేవలం తెర వెనుక మాత్రమే ఉండి సరికొత్త టాలెంట్‌ను సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం సమంత మెటర్నిటీ బ్రేక్‌లో ఉంది. ‘మా ఇంటి బంగారం’ వంటి భారీ విజయం తర్వాత వరుసగా సినిమాలు సైన్ చేయకుండా, ఒరిజినల్ కథలకు ప్రాధాన్యతనిచ్చేలా ఒక బలమైన ప్రొడక్షన్ లైనప్‌ను సెట్ చేసుకుంటుంది.

ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు యంగ్ ఫిల్మ్‌మేకర్స్‌తో చర్చలు ముగిశాయని, రాబోయే కొద్ది నెలల్లోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు రానున్నాయని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు