రెండోసారి బర్నింగ్ స్టార్ సక్సెస్ అవుతాడా?

Sampoornesh-Babu
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన ‘హృదయ కాలేయం’ సినిమా రేపు అనగా మే 9న మళ్ళీ రెండవసారి విడుదలవుతోంది. గత కొద్ది వారాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా హైదరబాద్ మరియు కొన్ని టౌన్స్ లో యావరేజ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంది.

సమ్మర్ హాలిడేస్ మొదలవడం అలాగే బాక్స్ ఆఫీసు వద్ద వేరే సినిమాలు ఏమీ రిలీజ్ కాకపోవడం వలన బాక్స్ ఆఫీసు వద్ద మళ్ళీ హెల్ప్ అవుతుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ సెకండ్ రిలీజ్ లో సంపూర్నేష్ బాబు సక్సెస్ అవుతాడా? మళ్ళీ ఎంతవరకూ ప్రేక్షకులను రాబట్టుకోగలడు? అనే విషయాలను అందరి మదిలోనూ ఉన్నాయి.

ట్రేడ్ వర్గాలు మాత్రం ఒక హీరో రిలీజ్ అయిన సినిమాతో రెండవ సారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడం అనేది కష్టం అని అంటున్నారు. ఎందుకంటే సినిమాలో ఉన్న కంటెంట్ రివీల్ అయిపోతుంది అలాగే రెండవసారి ఆ రేంజ్ లో ప్రీ రిలీజ్ క్రేజ్ తీసుకురావడం జరగదు. కావున సంపూర్నేష్ బాబు రెండవసారి ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి..

Exit mobile version