
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హాపెనింగ్ నేమ్ అఖిల్ అక్కినేని.. దానికి ప్రధాన కారణం అక్కినేని ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న మూడవతరం హీరో కావడం వలన అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో అఖిల్ మొదటి సినిమాతో ఏ మేరకు ఆకట్టుకుంటాడు అనే ఆసక్తి నెలకొంది. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ చేసిన మొదటి సినిమా ‘అఖిల్’ దీపావళి కానుకగా నవంబర్ 11న రిలీజ్ కానుంది. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాని కేవలం 140నిమిషాల(2 గంటల 10 నిమిషాల)రన్ టైంతో రిలీజ్ చేయనున్నారు.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా ఫాలో అవుతున్న ఫార్మాట్ షార్ట్ రన్ టైం.. ఈ ఫార్మాట్ చాలా సినిమాలకు బాగా హెల్ప్ అయ్యింది. అలా హెల్ప్ అవ్వడానికి ప్రధాన కారణం.. సినిమా అమధ్యలో కాస్త స్లోగా ఉన్నా రన్ టైం షార్ట్ అయితే సినిమా త్వరగా అయిపోయిన ఫీలింగ్ సినిమాని చాలా వరకూ సేవ్ చేస్తుందని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడు అదే ఫార్మాట్ లోనే వస్తున్న అఖిల్ సినిమాకి కూడా ఈ షార్ట్ రన్ టైం చాలా పెద్ద హెల్ప్ ఆవుతుందని ఈ చిత్ర టీం అంటోంది. 140 సినిమాలో 20 నిమిషాలకి పైనే పాటలు పోతాయి. దాంతో మెయిన్ కాన్సెప్ట్ ని 120 నిమిషాల్లోనే ఫినిష్ చేసెయ్యడం సినిమాకి బిగ్గెస్ట్ హెల్ప్ అని భావిస్తున్నారు. మరి ఈ షార్ట్ రన్ టైం ఎంతవరకూ అఖిల్ కి హెల్ప్ అవుతుందనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే..

