లేటెస్ట్..ఆస్కార్ స్టేజ్ పై జరిగిన ఘటనపై విల్ స్మిత్ బహిరంగ క్షమాపణ.!

Published on Mar 29, 2022 8:00 am IST


హాలీవుడ్ కి చెందినటువంటి దిగ్గజ స్టార్ హీరోస్ లో విల్ స్మిత్ కూడా ఒకరు. ఎన్నో భారీ చిత్రాల్లో నటించిన విల్ స్మిత్ తాజాగా జరిగినటువంటి ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ‘ఆస్కార్’ అవార్డును తన చిత్రం “కింగ్ రిచర్డ్” కి గాను ఉత్తమ నటుడుగా గెలుపొందాడు. అయితే ఈ శుభ సందర్భంలో ఓ షాకింగ్ సంఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.

తన భార్యపై అక్కడి వ్యాఖ్యాత అయినటువంటి క్రిస్ రాక్ పలు అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో విల్ స్మిత్ స్టేజ్ పైకి వెళ్లి అతడి చెంప చెళ్లుమనిపించాడు. మొదట అందరికీ అది నమ్మబుద్ది కాలేదు తర్వాత కాస్త తేరుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనితో ఒక్కసారిగా ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారగా తాజాగా విల్ స్మిత్ ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా బహిరంగ క్షమాపణను క్రిస్ కి తెలియజేసాడు.

వైలెన్స్ అనేది ఎపుడు ప్రమాదకరం, హేయమైనదే అని నిన్న ఆస్కార్ స్టేజ్ పై నేను అలా చేసి ఉండాల్సింది కాదు కానీ జోక్స్ పక్కన పెడితే అతడు నా భార్య ఆరోగ్య స్థితిపై కూడా అలా మాట్లాడ్డం నేను భరించలేకపోయాను అందుకే ఎంతో భావోద్వేగానికి లోనయ్యి క్రిస్ పై చెయ్యి చేసుకున్నానని, అందుకు తనకి ఇప్పుడు క్షమాపణ తెలియజేస్తున్నానని విల్ స్మిత్ తెలిపారు. అలాగే అకాడమీ కి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నానని స్మిత్ అధికారికంగా తెలిపి సెలవు తీసుకున్నాడు.

సంబంధిత సమాచారం :