ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర మంచి రసవత్తర పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు సినిమాలకి నిజంగా వసూళ్లు వస్తున్నాయా లేక కేవలం ఫ్యాన్స్ ఎమోషన్ ని శాటిస్ఫై చెయ్యడానికే పలు సినిమాల కలెక్షన్స్ పోస్టర్స్ పడుతున్నాయా అనేది అంతకంతకు చర్చకు దారి తీస్తుంది. అయితే ఈ ఆనవాయితీ మన తెలుగు సినిమాలో ఎప్పటి నుంచో ఉన్నదే కానీ నిజానికి అబద్దానికి మధ్యలో అసలు నిజం ఎవరికీ తెలియని డైలమా ఇతర సినిమాలకి బాగా నెగిటివ్ తీసుకొస్తుంది.
అలాగే ఇవే ఫేక్ వసూళ్లు మొన్న ఐటీ దాడులకు కూడా కారణం అని పలు కామెంట్స్ కూడా లేకపోలేదు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ ముచ్చట మంచి హాట్ టాపిక్ గా నడుస్తుండగా లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా పలువురు ఈ తరహా పోస్టర్స్ మూలాన తాము ఒకవేళ నిజంగా నష్టాలు వచ్చినా వచ్చాయి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది అంటున్నారు.
ఇలా కొందరి ఆనందం కోసం ఒక పక్క సినిమా నిర్మాతలకి అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కి మెయిన్ గా వీటి మూలాన ఒక సినిమా నుంచి మరో సినిమాకి నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోతుంది. అయితే వీటికి ఎండ్ కారు ఇకనైనా పడ్డట్టేనా లేక కంటిన్యూ అవుతుందా అనేది ముందు రోజుల్లో చూడాలి. యూనానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకే రెండు మూడు రోజులకి ఒకసారి వేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పొచ్చు. ఇక టాక్ తేడా వచ్చినపుడు అసలు వెయ్యకుండా కామ్ గా ఉంటేనే బెటర్ అనుకోవచ్చు. మరి ఈ ఫేక్ వసూళ్ల పోస్టర్స్ ముచ్చట ఎటు వెళుతుందో చూడాలి.