ఆ హీరోకు ప్రేమికుల రోజు కలిసి వస్తుందా ?

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన తరుణ్ ఆ తరువాత హీరోగా లవర్ బాయ్ గా తనకంటూ ఒక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ హీరో తాజాగా ఇది నా లవ్ స్టోరి సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్ టైనర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను రమేష్, గోపి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. శ్రీనాథ్ విజయ్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓవియా హెలెన్ తరుణ్ కు జోడిగా నటించింది.ఈ హీరోయిన్ తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. కామిడీ ఎంటర్‌టైన‌ర్‌ గా రాబోతున్న ఇది నా లవ్ స్టోరి సినిమాపై తరుణ్ హోప్స్ పెట్టుకున్నాడు. చూద్దాం ఈ సినిమాతో తరుణ్ మళ్ళి ట్రాక్ లోకి వస్తాడేమో.