‘మాస్టర్’ కాంబినేషన్ రిపీట్ కానుందా ?

Published on Jun 14, 2021 3:05 am IST

తమిళ్ స్టార్ హీరో విజయ్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపినా తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టడంతో.. ముఖ్యంగా తమిళంలో ఈ ఏడాది ‘మాస్టర్’ తప్ప మరో హిట్ లేకపోవడం కూడా విజయ్ సినిమాకి బాగా ప్లస్ అయింది.

అందుకే, విజయ్ మరోసారి ఆ దర్శకుడితో చేతులు కలపడానికి రెడీ అవుతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. కాగా తన తరువాత చిత్రాన్ని తీసే బాధ్యతని లోకేష్ కనగరాజ్ కి మళ్ళీ ఇచ్చాడట విజయ్. వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా మొదలుకానుంది. నిజానికి ‘మాస్టర్’ రిజల్ట్ లో దమ్ము లేదని విమర్శలు వచ్చినా.. విజయ్ ఇంకా లోకేష్ పై నమ్మకం ఉంచడం నిజంగా విశేషమే. .

సంబంధిత సమాచారం :