ఆ హీరోయిన్ ని పవనే కాపాడాలి?

Published on Aug 8, 2020 10:56 pm IST

పరిశ్రమలో ఎదగాలంటే టాలెంట్ ఎంతున్నా లక్ కూడా ఉండాలి. అందం, అభినయం ఉండి కూడా ఆ లక్ అనేది లేక పరిశ్రమ నుండి కనుమరుగైనోళ్లు ఎందరో ఉన్నారు. కాగా హీరోయిన్ శృతి హాసన్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా పరాజయాలు అందుకున్నాయి. ఐతే గబ్బర్ సింగ్ తో ఆమె ఫేట్ మారిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ కి మంచి బ్రేక్ వచ్చింది.

అప్పటి నుండి శృతి హాసన్ అనేక హిట్ చిత్రాలలో నటించింది. కాగా కొన్ని వ్యక్తిగత కారణాల వలన శృతి హాసన్ కెరీర్ పరంగా మరలా వెనుకబడింది. ఆమెకు ఇప్పుడు టాలీవుడ్ లో కానీ, కోలీవుడ్లో కానీ సరైన అవకాశాలు లేవు. ఐతే పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ లో హీరోయిన్ అవకాశం దక్కించుకుంది. ఈ మూవీలో తక్కువ నిడివి గల పాత్రలో పవన్ కి భార్యగా చేస్తుంది. గబ్బర్ సింగ్ తో ఫార్మ్ లోకి తెచ్చిన పవన్, వకీల్ సాబ్ మోవీలతో కమ్ బ్యాక్ లో మళ్ళీ బ్రేక్ ఇస్తాడని శృతి చాలా ఆశలే పెట్టుకుంది.

సంబంధిత సమాచారం :

More