విజయ్ కి క్రైౖమ్‌ థ్రిల్లరైనా హిట్ ఇస్తుందా..?

Published on Jun 4, 2019 12:13 am IST

ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో జూన్ 7న రాబోతున్న అనువాద చిత్రం ‘కిల్లర్‌’. ఇటీవలే విడుదల అయిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌ లో జరిగే ఓ మర్డర్‌ మిస్టరీ. యాక్షన్ కింగ్ అర్జున్.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. విజయ్ ఆంటోని ఓ సైకో కిల్లర్ పాత్రలో నటిస్తున్నాడు.

మరి విజయ్ అంటోనికి ఈ సినిమా హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో అషిమా కథానాయికగా నటించారు. సైమ‌న్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More