ప్రభుత్వాలకు షాకింగ్ సలహా ఇచ్చిన కొరటాల శివ !
Published on Jul 28, 2017 2:50 pm IST


టాలీవుడ్ పై దృష్టి పెట్టిన ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్ట్ బృందాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్టు అనుమానమున్న హీరో హీరోయిన్లను, పరిశ్రమలకు చెందిన ఇతర వ్యక్తులను తీవ్ర స్థాయిలో విచారిస్తూ రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటకు తెస్తున్న సంగతి తెల్సిందే. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ స్పందిస్తూ అందరూ షా అయ్యే రీతిలో ప్రభుత్వాలకు విలువైన సలాహా ఇచ్చారు.

అదేమిటంటే అన్ని ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి అవినీతిపై కూడా ఇలాగే తీవ్ర స్థాయి విచారణ జరపాలని ఎందుకంటే డ్రగ్స్ కన్నా అవినీతి సమాజానికి ఎక్కువ చేటు చేస్తుందని, అధికారులు చేయాలనుకుంటే చేయొచ్చని చురకలాంటి సలహా విసిరారు. మరి దీనిపై ప్రభుత్వాలు స్పందించి సినిమా వాళ్ళపై చూపిస్తున్న ప్రతాపాన్ని ఇతర రంగాల్లో ఉన్న అవినీతిపరులపై కూడా చూపిస్తారో లేదో చూడాలి.

 
Like us on Facebook