చరణ్ ఎంట్రీతో మరో లెవెల్ కి వెళ్లిన “ఆచార్య” హైప్.?

Published on Jan 22, 2021 1:00 pm IST

ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే పవర్ ఫుల్ సబ్జెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంత గానో ఎదురు చూస్తున్నారు.

అలాగే “సైరా” లాంటి బిగ్గెస్ట్ పీరియాడిక్ సినిమా తర్వాత ఈ కాంబో నుంచి అనౌన్సమెంట్ రావడంతో ఆ హైప్ వేరే లెవెల్ కు వెళ్లగా చరణ్ ఈ సినిమా షూట్ లోకి అడుగు పెట్టిన తర్వాత అది మరో లెవెల్ కే వెళ్లినట్టు తెలుస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.

ఈ చిత్రంలో “సిద్ధ” అంటూ పరిచయం చేసి జస్ట్ ప్రీ లుక్ లోనే ఆ రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అన్నది చూపించడం ఈ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లినట్టు అయ్యింది. అంతే కాకుండా అభిమానుల్లో మరియు సినీ వర్గాల్లో కూడా ఇదే టాక్ నడుస్తుంది. మరి సినిమాలో ఈ మెగా ఫ్రేమ్ ఎలా ఉంటుందో ఎంతటి హైప్ ను సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :