గడిచిన వారం అలాగే ఈ వారపు ఎపిసోడ్స్ తో తక్కువ స్పందనను అందుకుంటున్న తెలుగు అతిపెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మేకర్స్ ఇప్పుడు అనుకున్నదే చేసారు. ముందుగా ఇప్పుడు షోయెల్ మరియు అఖిల్ ల మధ్య ఫైనల్స్ రేస్ టికెట్ కోసం హోరాహోరీ పోరు జరుగుతుంది.
నిన్న ఉయ్యాల ఎక్కిన ఈ ఇద్దరు ఇంకా దిగలేదు. దీనితో ఈ ఇద్దరిలో ఎవరికి ఫైనల్స్ టికెట్ దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక లేటెస్ట్ ప్రోమో చూసినట్టు అయితే షోయెల్ చాలా ఎమోషనల్ అవ్వడం అలాగే ఇద్దరు కూడా ఉయ్యాల దిగేసి అభిజీత్ ను కౌగిలించుకొని ఏడవడం చూపించారు.
అలాగే వారిని అభి ఓదార్చడం వంటివి చేసారు. ఇక మరోపక్క ఈ ఫైనల్స్ టికెట్ తోనే వచ్చే డిసెంబర్ 7 నుంచి షో ను రాత్రి 10 గంటల నుంచి ప్రసారం చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. అలాగే వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం యథావిధిగా 9 గంటలకే ప్రసారం కానున్నాయి. మొత్తానికి మాత్రం వీక్ రెస్పాన్స్ వలనే ఇపుడు టైమింగ్ మార్చారని చెప్పాలి.
Final stage for 'Ticket to finale'…Who will win?#BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/wi10oVOhJo
— Starmaa (@StarMaa) December 4, 2020