“ఆచార్య” సెట్స్ లోకి తన భర్తతో కాజల్..మెగాస్టార్ ఆశీస్సులు!

“ఆచార్య” సెట్స్ లోకి తన భర్తతో కాజల్..మెగాస్టార్ ఆశీస్సులు!

Published on Dec 15, 2020 1:00 PM IST

chiru kajal

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. మంచి హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రంలో మరోసారి చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవలే కాజల్ కు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కీచ్లు తో విహహం జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ యువ జంట ఇప్పుడు ఆచార్య సెట్స్ లోకి అడుగు పెట్టి చిరును సర్ప్రైజ్ చేసారు. ఇక వీరిద్దరి రాకతో చిరు వారితో కేక్ ను కట్ చేయించి వారికి తన ఆశీస్సులను అందించారు.

అంతే కాకుండా వారితో సెట్స్ లోనే దండలు మార్పించి సందడి వాతావరణం నెలకొల్పారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కుతుంది. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు