అతని రాక పట్ల “ఆదిపురుష్” పై మరింత ఆసక్తి.!

Published on May 19, 2021 1:08 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ పాన్ ఇండియన్ చిత్రాలు కూడా ఇక్కడే హైదరాబాద్ లో షూట్ జరుపుకోనున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” ఒకటి. మరి ఈ చిత్రంలో రామునిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు.

అయితే ఇతర క్యాస్టింగ్ పరంగా వినిపిస్తున్న టాక్స్ ప్రకారం మేఘనాథుని పాత్రకు బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్ల నటిస్తున్నాడని టాక్ వచ్చింది. అయితే అతడు నిజంగానే ఉన్నదో లేదో కానీ జస్ట్ ఈ టాక్ కే ఆదిపురుష్ పై బాలీవుడ్ వర్గాల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది.

దీనితో అక్కడ మరింత ఆసక్తి కూడా ఏర్పడింది. మరి ప్రభాస్ మరియు సిద్ధార్థ్ శుక్లా లు నిజంగానే స్క్రీన్ పంచుకుంటున్నారో లేదో అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక ఈ చిత్రంలో రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది ఆగష్టు 11 న విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :