మరిన్ని ఎంట్రీస్ మరింత హీటెక్కుతున్న “మా” ఎన్నికలు.!

Published on Jun 24, 2021 8:00 am IST

టాలీవుడ్ పరిశ్రమలో ఎన్నికల పర్వం మొదలై మంచి రసవత్తరంగా మారిపోయింది. ఇది వరకటిలా కాకుండా ఈసారి “మా”(మూవీ ఆర్టిస్ట్స్ అసోసేషియన్) ఎన్నికలు ఊహించని వ్యక్తుల ఎంట్రీస్ తో ఊపందుకుంది. అయితే మొట్ట మొదటిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అలాగే మంచు వారి అబ్బాయి మంచు విష్ణులు సెక్రటరీ పోస్ట్ కి పోటీ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అవ్వగా పోటీ వారి నడుమ మాత్రమే ఉంటుంది అని తెలిసింది.

కానీ అదే పోస్ట్ కి మరిన్ని చీలికలు వచ్చి జీవితా రాజశేఖర్ నిన్ననే నటి హేమ కూడా పోటీ చేస్తున్నారని తెలిసింది. మరి ఇప్పుడు వీరితో పాటు మరో ఎంట్రీ కూడా ఆ పోస్ట్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. అదే మరో సీనియర్ స్టార్ నటుడు సాయి కుమార్ సెక్రటరీ పోస్ట్ కి పోటీ చెయ్యడానికి సిద్ధం అయ్యారట. మరి ఇలా క్రమంగా పెరుగుతున్న ఈ ఎంట్రీస్ నడుమ ఎవరు పోటీలో నెగ్గుతారో అన్నది మరింత ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం :