ఈరోజు మెగా డాటర్ నిహారిక అలాగే చైతన్య జొన్నలగడ్డ వివాహం కావడంతో నుంచే సందడి మొదలయ్యిపోయింది. ఇక అలాగే ఊహించని అతిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడికి బయలుదేరడం అలాగే మొత్తం మెగా హీరోలు కుటుంబం అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే ఎప్పుడు కుటుంబ ఫంక్షన్లకు దాదాపు దూరంగా ఉండే పవన్ కళ్యాణే హాజరు కావడం అట్రాక్షన్ అయితే పవన్ ను మించిన స్పెషల్ అట్రాక్షన్ గా మెగా బ్రదర్ బాస్ మెగాస్టార్ చిరంజీవి నిలిచారు అని చెప్పాలి.
అక్కడ అంతమంది మెగా యువ హీరోలు అల్లు అర్జున్, చరణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ లు ఉన్నప్పటికీ చిరు మాత్రం మరింత స్మార్ట్ అండ్ యంగ్ గా కనిపించడమే గమనార్హం. ఇప్పుడు ఈ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి మాత్రం ఈ ఫొటోలతో మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.


