“శత్రువు”తో 31 ఏళ్ళు పూర్తి చేసుకున్న సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్!

Published on Oct 27, 2020 3:00 pm IST

మన టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులలో ఎలాంటి మచ్చ లేని స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. తన పెర్ఫామెన్స్ తో ఇప్పటి తరానికి వెంకీ మామగా మారిన వెంకటేష్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ మరియు మంచి మరపురాని చిత్రాలు ఉన్నాయి అలాంటి చిత్రాల్లో ఒకటే “శత్రువు”.

లెజెండరీ దర్శకులు కోడి రామ కృష్ణ తెరకెక్కించిన అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రంతోనే తెలుగు ఇండస్ట్రీకు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పరిచయం అయ్యింది. 1989లో సరిగ్గా ఇదే రోజున పరిచయం కాబడి ఈ 31 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన అందించిన అందించిన ఈ బ్యానర్ అధినేత అయినటుంటి ప్రముఖ దర్శక నిర్మాత ఎం ఎస్ రాజు ఎమోషన్ పోస్ట్ పెట్టారు.

“1989అక్టోబర్ 27, నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు. మా “సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్”కి మద్రాస్ లో పునాది పడిన రోజు. దర్శకుడు కోడి రామకృష్ణతో స్ట్రాంగ్ రిలేషన్, హీరో వెంకటేష్ తో బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్,అలాగే లేడీ అమితాబ్ హీరోయిన్ విజయశాంతి తో మంచి అసోసియేషన్ కి ఈ “శత్రువు”మూవీ శ్రీకారం చుట్టినట్టు అయ్యిందని” ఆయన అప్పటి ఓ మరపురాని ఫొటోతో తో పంచుకున్నారు.

సంబంధిత సమాచారం :

More