ఈ మూడు మాస్ కాంబోస్ తో మరింత వేడెక్కనున్న వచ్చే వేసవి.!

Published on May 2, 2021 11:41 am IST

కొన్ని కొన్ని మాస్ పదాలు కొన్ని మాస్ కాంబోస్ ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అలాంటి కాంబినేషన్లే ఇప్పుడు టాలీవుడ్ నుంచి సిద్ధంగా ఉన్నాయి. నిన్ననే సూపర్ స్టార్ మహేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సినిమాతో కన్ఫర్మ్ అయ్యింది. ఈ మోస్ట్ అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ నిన్న అనౌన్స్ చెయ్యడంతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ మరింత హీటెక్కి మరో స్థాయి విధ్వంసం కు రంగం సిద్ధం అయ్యిందని అర్ధం అయ్యింది.

వచ్చే ఏడాది వేసవి రేస్ లోనే ఈ సినిమాతో పాటుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబోలో “సలార్” అనే భారీ యాక్షన్ మొదటగా ఈ వేసవి రేస్ ను స్టార్ట్ చెయ్యగా దాని తర్వాత మరో మాస్ అండ్ సెన్సేషనల్ కాంబో యంగ్ టైగర్ అండ్ కొరటాల శివ దర్శకత్వంలో బెంచ్ మార్క్ సినిమా కూడ ఉంది. ఇలా మూడూ ఒకదాన్ని మించిన ఒక కాంబోలే..అలాంటప్పుడు ఇండియన్ అండ్ తెలుగు బాక్సాఫీస్ దగ్గర మాస్ డిస్ట్రక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో కూడా ఊహించలేం అని చెప్పాలి. మొత్తానికి మాత్రం ఆ హై టైం వరకు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :