“ఫ్యామిలీ మ్యాన్ 2” ట్రైలర్ తోనే ఈ డీటెయిల్ కూడా..!

Published on May 18, 2021 7:06 am IST

ప్రస్తుతం మన ఇండియన్ ఓటిటి వీక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్.. సీజన్ 1 సూపర్ హిట్ కావడంతో సీజన్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ మోసగ్ అవైటెడ్ సిరీస్ రావడానికి సిద్ధం అయ్యింది.

ఇక దానికి ముందు ట్రైలర్ కట్ ను మేకర్స్ ఈ వారంలో విడుదల చేయనున్నారు అని ఇది వరకే తెలిపాము. మరి దాని ప్రకారమే రేపే మే 19 న ముహూర్తం ఫిక్స్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత మనోజ్ భాజ్ పై లు నటించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తాలూకా విడుదల తేదీ కూడా ఇదే ట్రయిలర్ తో ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది..

మరి ఈ డీటెయిల్ కూడా వస్తుందో లేదో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే లు దర్శకత్వం వహించగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :