వెంకీతో అయితే వెంట‌నే ఒప్పుకుంటా !
Published on Jan 11, 2019 5:00 pm IST

దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వస్తోన్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). కాగా ఈ చిత్రంలో వరుణ్ – వెంకీ తోడల్లుళ్లుగా నటించారు. అయితే వెంకీతో కలిసి నటించడం గురించి.. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. నా చిన్నతనంలోనే వెంకటేష్ గారితో నటించే అవకాశం వచ్చింది. ఆయన హీరోగా వచ్చిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో నాకు ఆయన కొడుకుగా నటించే ఆఫర్ వచ్చింది. కానీ అది మిస్ అయింది.

అలాగే మరోసారి ‘వాసు’ సినిమాలో వెంకటేష్ గారికి తమ్ముడిగా నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ ఆ సినిమాలో కూడా నటించలేకపోయాను. ఎట్టకేలకు ఆయ‌న‌తో ఎఫ్ 2 లో క‌ల‌సి న‌టించాను. ఈసారి మాత్రం వెంక‌టేష్ గారితో సినిమా అంటే క‌థ గురించి గాని, నా పాత్ర గురించి గాని ఏమి అడ‌గ‌ను. వెంకీతో సినిమా అంటే చాలు వెంట‌నే ఒప్పుకుంటా. ఎందుకంటే మా అంద‌రికీ ఆయ‌న డార్లింగ్‌’ అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

ఇక అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగా చిత్రీకరించారట. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook