రేపు క్రికెట్ మ్యాచ్ ఉందని భయపడుతోన్న స్టార్ హీరో !

Published on Jun 4, 2019 3:30 pm IST

ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా ముచ్చటించుకోవాల్సిన పనిలేదు. పైగా వరల్డ్ కప్ జరిగితుంటే.. ఇక క్రికెట్ అభిమానులు దేన్నీ పట్టించుకోరు. ప్రస్తుతం ఇదే సల్మాన్ ఖాన్ సినిమాకి పెద్ద ఎదురు దెబ్బలా అనిపిస్తోంది. రేపు ఈద్. సల్మాన్ ఖాన్ అభిమానులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులంతా ఈద్ రోజున సల్మాన్ ఖాన్ సినిమా చూడటం ఆనవాయితీ. ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో మన కండల వీరుడు థియేటర్స్ లో సందడి చేయాల్సిందే.

ఆలాగే ఈ ఏడాది ఈద్ కి కూడా సల్మాన్ ఖాన్ భారత్ మూవీ విడుదల కాబోతున్నది. అయితే రేపు వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా – సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం యావత్తు ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సినిమా ఈ రోజు కాకపోతే, మరో రోజు చూడొచ్చు. కానీ మ్యాచ్ లైవ్ మాత్రమే చూడగలం అని ప్రేక్షకులు భావిస్తే.. భారత్ కి బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. అందుకే సల్మాన్ సినిమా విడుదల విషయంలో కొంత టెన్షన్ పడుతున్నాడట.

సంబంధిత సమాచారం :

More