రఫ్ లుక్ లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ !

Published on Sep 20, 2019 5:00 pm IST

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కాగా తాజాగా సినిమా ఈ నుండి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్ లుక్ అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్ లో విజయ్ దేవరకొండ చాల రఫ్ లుక్ లో మొహం మీద బ్లెడ్ మరకలతో చేతిలో సిగిరెట్ తో చాల ఆవేశంతో పెద్దగా అరుస్తునట్లు కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా టైటిల్ కి, పోస్టర్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా పోస్టర్ ను డిజైన్ చేసింది చిత్రబృందం. అయితే పోస్టర్ మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

కాగా ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో విజయ్ దేవరకొండ సరసన రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మొత్తానికి టైటిల్ బాగా క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుంది చూడాలి. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More