వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిడివి ఎంతంటే?

Published on Feb 10, 2020 3:05 pm IST

విజయ్ దేవరకొండ నటించిన మరో క్రేజీ ప్రాజెక్ట్ వరల్డ్ ఫేమస్ లవర్. ఈ చిత్ర ప్రకటన సమయంలో ఎటువంటి అంచనాలు లేకున్నా టీజర్, ట్రైలర్స్ విడుదల తరువాత హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనితో చిత్రంపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగుతో పాటు తమిళంతో కూడా విడుదల అవుతుంది. నేడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ నిడివి 155 నిమిషాలుగా నిర్ణయించారు. అనగా దాదాపు 2.35 నిముషాలు అన్న మాట. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తుండగా, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్స్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :