ట్రైలర్ తో అలరిస్తోన్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ !

Published on Feb 6, 2020 4:08 pm IST

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా హీరోయిన్స్‌ గా ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రాబోతున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. యూత్ ని అండ్ లవర్స్ ను టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ ట్రైలర్ లో ఎమోషన్, లవ్ అండ్ పెయిన్ అలాగే బోల్డ్ నెస్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ కనిపించిన రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ట్రైలర్ లో బాగా హైలైట్ అయ్యాయి.

సినిమాలో విజయ్ దేవరకొండకి నలుగురి అమ్మాయిలకు మధ్య సాగిన లవ్ స్టోరీస్..? వారి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎలాంటిది ? ఈ మధ్యలో అతని లైఫ్ లో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? లాంటి విషయాలను ట్రైలర్ లో ఇంటర్నల్ గా బాగా ఎలివేట్ చేశారు. మొత్తానికి ట్రైలర్ సినిమా పై ఒక్కసారిగా అంచనాలను రెట్టింపు చేసింది.

ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ సినిమా కోసం రాశీఖ‌న్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. అన్నట్టు ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. అలాగే జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సీనియర్ నిర్మాత కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

X
More