పవన్ లాంటి మంచి వాళ్ళు కావాలి – రేణు దేశాయ్

పవన్ లాంటి మంచి వాళ్ళు కావాలి – రేణు దేశాయ్

Published on Apr 13, 2014 8:00 PM IST

pawan-kalyan-renu-desai
పవన్ కళ్యాణ్ ని ఓ సారి పెళ్లి చేసుకున్న హీరోయిన్ రేణు దేశాయ్, ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. కానీ వారు విడిపోయినప్పటికీ వారిమధ్య విభేదాలు ఏమీలేవు. చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ ఎందుకు విడిపోయింది అనే విషయంపై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాలకు రేణు దేశాయ్ చెక్ పెట్టింది.

తన ఫేస్ బుక్ పేజ్ లో ఈ విషయంపై స్పందిస్తూ ‘ నేను ఇచ్చిన మా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత పబ్లిక్ గా పవన్ గురించి మాట్లాడుతున్నది ఇదే ప్రధమం. ప్రపంచంలోనే ఎంతో నిక్కచ్చిగా నిజాయితీ గా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. మనసులో ఇలాంటివి దాచుకోకుండా ఉండే జెన్యూన్ వ్యక్తి. మేము ఇద్దరం విడిపోవడానికి గల కారణం మాకు మాత్రమే తెలుసు. ఆ విషయంలో కామెంట్ చేసే అధికారం ఎవరికీ లేదు. నేను ఇప్పటికీ పవన్ కి పూర్తి రెస్పెక్ట్ ఇస్తాను, నమ్ముతాను. అలాగే అతను సొసైటీ కోసం చేస్తున్నది మేచ్చుకోవాల్సినది. అలాగే నేను తనని ఎప్పటికీ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రపంచానికి ఇలాంటి నిజాయితీ పరులు కావాలని’ రేణు దేశాయ్ పోస్ట్ చేసింది.

చాల ఆరోజుల నుంచి విసుగెత్తి పోయేలా చేసిన ఈ వార్తలకి రేను దేశాయ్ క్లియర్ గా సమాధానం ఇచ్చింది. తను అన్న మాటల నుంచి ఇక ఎవరు ఎలా కామెంట్ చేస్తారో చూడాలి..

తాజా వార్తలు