వరల్డ్ రికార్డు సెట్ చేసిన దిల్ బేచారా.

Published on Jul 12, 2020 11:28 pm IST

సుశాంత్ సింగ్ మరణం ఆయన ఫ్యాన్స్ ని ఎంతగానో కలచివేయగా, చివరి చిత్రం దిల్ బేచారా పై అంతులేని పేమ చూపిస్తున్నారు. దిల్ బేచారా ట్రైలర్ వరల్డ్ రికార్డు సెట్ చేసింది. ఇటీవల విడుదలైన దిల్ బేచారా ట్రైలర్ తక్కువ కాలంలో ఏకంగా 69 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. దానితో పాటు ఈ ట్రైలర్ కి 10 మిలియన్ లైక్స్ రావడం అనేది అరుదైన రికార్డు. సుశాంత్ ఫ్యాన్స్ దిల్ బేచారా ట్రైలర్ ని చూస్తూ సోషల్ మాధ్యమాలలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీనితో ఈ ట్రైలర్ అలా అరుదైన రికార్డ్ అందుకుంది.

ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ నవల ఆధారంగా దర్శకుడు ముఖేష్ చబ్రా ఈ చిత్రాన్ని రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కించారు. ఫాక్స్ స్టార్స్ స్టూడియోస్ నిర్మాణం తెరకెక్కిన ఈ మూవీ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మూవీకి మ్యూజిక్ లెజెండ్ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించడం విశేషం.

వీడియో కొరకు ఇక్కడ చేయండి

సంబంధిత సమాచారం :

More