“భజరంగి భాయిజాన్” సీక్వెల్ పై రైటర్ విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ!

Published on Mar 24, 2022 4:15 pm IST


సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వం లో తెరకెక్కిన సెన్సేషన్ మూవీ భజరంగి భాయిజాన్. ఈ చిత్రానికి బాహుబలి సిరీస్ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ ను అందించారు. స్క్రీన్ ప్లే లో కూడా భాగం అయిన విజయేంద్ర ప్రసాద్, మరొకసారి ఈ చిత్రం గురించి తాజాగా ప్రస్తావించారు. భజరంగి భాయిజాన్ చిత్రం కి సీక్వెల్ గా పవన్ పుత్ర భాయిజాన్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి కి ఆర్ ఆర్ ఆర్ మూవీ కి కథ ను అందించిన విజయేంద్ర ప్రసాద్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మార్చ్ 25 వ తేదీన విడుదల కానుంది. తాజాగా చేసిన వ్యాఖ్యల తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సల్మాన్ ఖాన్ తో మరో చిత్రం ఖాయం కావడం తో, ఇది కూడా బ్లాక్ బస్టర్ అంటూ కొందరు అంటున్నారు.

సంబంధిత సమాచారం :