ఏప్రిల్ 26 న రానున్న ‘యమలోకం’ !

Published on Apr 23, 2019 11:49 am IST

ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ వడివేలు, యామిని శర్మ, సుజా వారుణి, శ్రియా శరన్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం “ఇందిరాలోతలి నా అజాగప్పన్”. యమలోకం బ్యాక్గ్రౌండ్ లో ఫుల్ లెంత్ కామేడి తో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో యమలోకం పేరుతో డబ్ చేసారు.

కెవిఆర్ సమర్పణలో జె.ఏల్.కె ఎంటర్ ప్రైసేస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న విడుదలచేస్తుంది. కోలీవుడ్ టాప్ కమెడియన్ తంబి రామయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :