భీమవరం టాకీస్ పతాకంపై మధు చిట్టె, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి, ధక్షిత్ రెడ్ది, నటీనటులుగా నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం జాతీయరహదరి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ నెల 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్స్ లో విడుదల కు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ గారి చేతుల మీదుగా జాతీయరహదరి లిరికాల్ సాంగ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాధ్ మాట్లాడుతూ, దర్శకుడు నరసింహ నంది ప్రతిభ కలిగిన నేషనల్ అవార్డ్ గ్రహీత అని, ట్రైలర్ చాలా బాగుంది అని, ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అని అన్నారు.
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ, తనకు ఎంతో ఇష్టమైన శ్రీ యండమూరి గారి చేతులు మీదుగా ఈ సాంగ్ విడుదల చేయటం ఆనంద దాయకం అని అన్నారు. నరసింహ నంది అద్భుతమైన దర్శకుడు అని, అతనిని నమ్మి దర్శక భాద్యతలు అప్పగించాను దానికి 100 శాతం న్యాయం చేశారు అని తెలిపారు. ఈ సినిమా హిట్ అతని ఖాతా లోకే వెళ్తాది అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సుక్కు అందించగా, వి. నాగిరెడ్డి ఎడిటర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి సినిమాటొగ్రఫి యస్ మురలి మొహన్ రెడ్డి అందించారు.
