కన్నడ సినీ కార్మికుల కోసం భారీ మొత్తం డోనేట్ చేసిన యష్

Published on Jun 2, 2021 3:00 am IST

కరోనా ప్రభావంతో అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమ కూడ తీవ్రంగా దెబ్బతింది. సినిమా షూటింగ్స్ జరక్కపోవడంతో సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల కార్మికులు కష్టాలు పడుతున్నారు. రోజువారీ వేతనాలతో జీవించేవారి పరిస్థితి మరీ దయనీయమైంది. అందుకే సినిమా స్టార్లు ఎవరికి వారు ముందుకొచ్చి తమ పరిశ్రమలోని కార్మికులను ఆదుకుంటున్నారు. తాజాగా కన్నడ స్టార్ హీరో యష్ కన్నడ సినీ కార్మికుల కోసం భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు.

21 విభాగాల్లో పనిచేస్తున్న 3000 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 5000 చొప్పున మొత్తం ఒకటిన్నర కోటి రూపాయలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నారు యష్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను చేసే సహాయం కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తుందని కాదు కానీ ఇలాంటి కష్ట కాలంలో ఇదొక ఆశాకిరణం లాంటిదని భావిస్తున్నాను. నా సొంత సంపాదన నుండి 3000 మందికి ఒక్కొక్కరికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను అన్నారు యష్. కార్మికులకు యష్ చేసిన ఈ సహాయం నిజంగా అభినందనీయం. ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ చేసిన ‘కెజిఎఫ్-2’ అన్ని పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :