“కేజీయఫ్ 2″కు ఈ వర్క్ స్టార్ట్ చేసేసిన యష్.!

Published on Mar 27, 2021 8:00 am IST

ఇండియన్ సినిమాలో భారీ అంచనాలు సెట్ చేసుకున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. మరి ఆల్రెడీ షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరి ఈ పనుల్లో మరియు ప్రభాస్ తో చేస్తున్న “సలార్” షూట్ లో నీల్ నిర్విరామంగా పని చేస్తున్నారు.

అయితే ఈ చిత్రంపై మరో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రానికి గాను యష్ తన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసేసాడట. అయితే యష్ ఆ మధ్య కన్నడ తో పాటుగా హిందీ డబ్బింగ్ కూడా చెప్తాడని టాక్ వచ్చింది మరి అది ఎంత వరకు నిజమో చూడాలి. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ వచ్చే జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :